30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు వెనక్కి.. | - | Sakshi
Sakshi News home page

30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు వెనక్కి..

Jan 10 2026 9:43 AM | Updated on Jan 10 2026 9:43 AM

30 వే

30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు వెనక్కి..

తిరుపతి అర్బన్‌: జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో కార్డుదారులు తీసుకోకుండా మిగిలిపోయిన 30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు తిరిగి జిల్లా సివిల్‌ సఫ్లయి కార్యాలయానికి చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో మిగిలిన 29 మండలాల నుంచి స్మార్ట్‌ కార్డులు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నాయి. జిల్లాలో 1,457 రేషన్‌ దుకాణాల పరిధిలో 5,64,567 రేషన్‌కార్డులున్నాయి. అయితే 50 రోజుల పాటు పంపిణీ చేసినప్పటికీ తీసుకోకుండా పెద్ద సంఖ్యలో కా ర్డులు మిగిలిపోయారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల కార్డులు వెనక్కి వస్తాయని చర్చ సాగు తోంది. ఇప్పటికే 30 వేలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఎర్రచందనం కేసులో

ఇద్దరికి ఐదేళ్ల జైలు

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల వంతున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్‌ అధికారి హరినాథ్‌, కానిస్టేబుల్‌ గంగాధరం కథనం మేరకు.. 2018 అక్టోబర్‌ మూడో తేదీ ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై భాకరాపేట పోలీసులకు సమాచారం అందడంతో వారు చిన్నగొట్టిగల్లు మండలం చెట్టివారిపాళెం, తేట్టుపల్లి రోడ్డు, చిట్టివారిపాళెం క్రాస్‌ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఓ కారు పోలీసులకు దూరంగా ఆగింది. ఆ కారులోని తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, ఉత్తమగిరి తాలూకా, కావేరి కొట్టై గ్రామానికి చెందిన సంపత్‌ అరుల్‌, తమిళనాడు, సేలం జిల్లా, పీతనాయం పాళ్యం తాలూకా, కుంభపాడి గ్రామానికి చెందిన వి.సతీష్‌ కుమార్‌ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ అమర నారాయణ వాదించారు.

చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

రైల్వేకోడూరు అర్బన్‌ : పుల్లంపేట రామక్కపల్లికి చెందిన అన్నపూర్ణ, ఇందిరమ్మలు ఈనెల 5వ తేదీన ప్రభుత్వాస్పత్రికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి మోటర్‌సైకిల్‌పై వచ్చి కత్తితో బెదిరించి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లాడు. ఈ కేసులో శుక్రవారం రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజంపేటకు చెందిన నిందితుడు రావూరు మోహన్‌ను అరెస్టు చేసి, బంగార ఆభరణం, మోటారుసైకిల్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన శ్రీనివాసులు, ఎస్‌ఐ చినరెడ్డెప్ప, సిబ్బందిని అభినందించారు.

శ్రీవారిమెట్టులో చిరుత కలకలం

అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం

చంద్రగిరి: తిరుమల కాలిబాట శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత పులి సంచారం శుక్రవారం కలకలం సృష్టించింది. భక్తులకు చిరుత పులి కనిపించడంతో ఒక్కసారిగా టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు, శ్రీవారిమెట్టు ప్రాంతా న్ని పరిశీలించారు. 450వ మెట్టు వద్ద చిరుత పులి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో శ్రీవారిమెట్టులోని శ్రీనివాస ఆలయం వద్ద భ క్తులను తిరుమలకు వెళ్లకుండా బ్యారికేడ్లతో అ డ్డుకున్నారు. సుమారు మూడు గంటల పాటు భక్తులను నిలువరించారు. ఆపై చిరుత జాడ కనిపించకపోవడంతో గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు వెనక్కి.. 
1
1/1

30 వేల స్మార్ట్‌ రేషన్‌కార్డులు వెనక్కి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement