కియా సెల్టోస్ నూతన కారు ఆవిష్కరణ
చంద్రగిరి: చైన్నె – బెంగళూరు రహదారి తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం సాయంత్రం కియా సెల్టోస్ నూతన కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథరెడ్డి, డైరెక్టర్ చెరకు నిరంజన్, సి. భారతి, సి. హోషిమా రెడ్డిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సి. జగన్నాథరెడ్డి మాట్లాడుతూ కియా నుంచి విడుదలైన కియా సెల్టోస్‌లో అత్యాధునిక సదుపాయాలతో ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇందులో 2 డీఏఎస్ పానరోమిక్ సన్ రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ కారు బుకింగ్‌కు 86888 29739 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
టెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా గత నెల 10వ తేదీ నుంచి 21 వరకు 9 పరీక్షా కేంద్రాల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు జరిగిన టెట్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఫలితాల్లో 47.82శాతం మంది అర్హత సాధించగా జిల్లా నుంచి 39.68శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో ఫైయిల్ అయినవారికి మరో సారి పరీక్ష రాసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2012 లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
శ్రీసిటీలో ‘హెల్తియం మెడిటెక్’ పరిశ్రమ విస్తరణ
శ్రీసిటీ(సత్యవేడు): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ‘ హెల్తియం మెడిటెక్ ’శ్రీసిటీలోని తన తయారీ యూనిట్‌ను విస్తరించింది. నూతన విస్తరణ యూనిట్‌ను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కంపెనీ సీఈఓ అనీష్ బప్నా, ఇతర ప్రముఖులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనీష్ బప్నా మాట్లాడుతూ ఈ విస్తరణ భారత్ ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధిని పెంపొందిచడంలో తమ నిబద్ధతను చాటుతుందన్నారు. ఇక్కడ నాణ్యమైన వైద్య పరికరాల తయారీ ద్వారా దిగుమతులను తగ్గించడంతోపాటు, దేశంలోనే కాక రోగులకు అత్యాధునిక సాంకేతికత అందించగలుగుతామని అన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సత్యవేడు : మండలంలోని దాసుకుప్పం పంచాయతీ అటవీ ప్రాంత సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. శుక్రవారం పోలీసులు శవాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఆరు రోజుల ముందు మృతి చెంది ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. గుర్తు పట్టలేని విధంగా శవం కుళ్లిపోయి ఉంది. ఎస్‌ఐ లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కియా సెల్టోస్ నూతన కారు ఆవిష్కరణ


