పడవ షికారుకి పైసా వసూల్
తడ: ఫ్లెమింగో ఫెస్టివల్‌కి వచ్చి పులికాట్ సరస్సుపై పడవ షికారు చేసే పర్యాటకుల నుంచి చార్టీలు వసూలు చేయనున్నారు. ఫెస్టివల్ ఏర్పాటు చేసిన నాటి నుంచి బీవీపాళెం పడవల రేవు వచ్చే సందర్శకులకు సరస్సు అందాలు, సరస్సుకు వచ్చే దేశ, విదేశీ పక్షుల గురించి అవగాహన కల్పించేందుకు, పులికాట్ సరస్సును నమ్ముకుని జీవించే జాలర్ల జీవన చిత్రం అవగతం అయ్యేందుకు పడవ షికారును ఉచితంగా అందుబాటులో ఉంచే వారు. ఈ ఏడాది దానికి నగదు వసూలు చేసుందుకు నిర్వాహకులు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తిప్పిన విధంగా సరస్సులో కొంత దూరం వెళ్లి వచ్చేందుకు 15 ఏళ్లకు పైబడిన వారి నుంచి మనిషికి రూ.30 వసూలు చేయగా ఇరకం వరకు వెళ్లి వచ్చేందుకు రూ.వంద వసూలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే నగదును పడవల యజమానులకే అందించేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్ననట్టు సమాచారం.


