సూరావారిపల్లెలో చోరీ
శ్రీకాళహస్తి: మండలంలోని సూరావారిపల్లెలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ప్రసాద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ప్రసాద్ బుధవారం సొంత పని నిమిత్తం పొరుగూరికి వెళ్లాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 72 గ్రాముల బంగారం, అరకేజీ వెండి అపహరించుకుపోయారు. ఉదయం గ్రామస్తులు చూడగా తెలుపులు తెరిచి ఉండడంతో ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతిక్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు చోరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


