శ్రీహరికోట నుంచి ఈ నెల 12వ తేదీన నిర్వహించే పీఎస్‌ఎల్‌వ
105.. కావాలి విజయ విహారం
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్‌ఽ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 12న ఉదయం 10.17 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ62 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. రాకెట్ ప్రయోగానికి 24 గంటలకు ముందు అంటే ఈనెల 11న ఉదయం 10.17 గంటలకు కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈనెల 10న ఎంఆర్‌ఆర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరిస్‌లో అత్యంత తేలికగా కలిగిన పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ (అంటే రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో) ప్రయోగాన్ని నిర్వహించేందుకు రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి, తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా భారతదేశ రక్షణ కోసం ఉపయోగించే 1,485 కిలో బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (ఆన్వేషన్) అనే ఉపగ్రహాన్ని భూమికి 600 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు భారత్‌లోని స్టార్టప్ కంపెనీ ధృవ స్సేన్ సంస్థ వారు డీఎస్‌యూశాట్, సీజీయూశాట్, ఎంఓఐ–1, లాచిట్, తైబోల్ట్–3, సంస్కార్ శాట్, ఆర్బిట్ ఎయిడ్ సంస్థకు చెందిన ఆయూల్‌శాట్, బ్రెజిల్ దేశానికి చెందిన ఎడ్యుశాట్, యూశాట్, గెలాక్సీ ఎక్స్‌పోరల్, ఆర్బిటల్ టెంపుల్, ఆల్‌డీబరన్–1 అనే బుల్లి ఉపగ్రహాలు, యూకేకి చెందిన థియోస్–2, నేపాల్‌కు చెందిన మునాల్, ఫ్రాన్స్‌కు చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాలను కూడా రోదశీలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఉపగ్రహాలు బరువు తక్కువగా ఉండడంతో రెండు స్ట్రాపాన్ బూస్టర్లుతో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులకు సంబంధించి ఇమేజ్‌లను విడుదల చేశారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ అంటే రెండు బూస్టర్లతో చేసిన ప్రయోగాల్లో ఇది ఐదో ప్రయోగం. షార్ నుంచి 105వ ప్రయోగం కావడం గమనార్హం.
శ్రీహరికోట నుంచి ఈ నెల 12వ తేదీన నిర్వహించే పీఎస్‌ఎల్‌వ
శ్రీహరికోట నుంచి ఈ నెల 12వ తేదీన నిర్వహించే పీఎస్‌ఎల్‌వ
శ్రీహరికోట నుంచి ఈ నెల 12వ తేదీన నిర్వహించే పీఎస్‌ఎల్‌వ


