మహిళా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉష బాధ్యతల స్వీకరణ
తిరుపతి రూరల్: మహిళా యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా బయో టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్.ఉష గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత రెండు దశాబ్దాలకు పైగా విస్తృతమైన బోధన, పరిశోధనా, పరిపాలనా అనుభవం కలిగిన ఆమెకు రిజిస్ట్రార్‌గా అవకాశం వచ్చింది. అనంతరం వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ, పూర్వ రిజిస్ట్రార్ రజనితో పాటు పలువురు అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాభినందనలు తెలిపారు. మహిళా యూనివర్సిటీలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మొదలైన ఉష ప్రస్థానం రిజిస్ట్రార్ వరకు చేరింది. అలాగే శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో టీచింగ్ అసిస్టెంట్‌గా, సీఎస్‌ఐఆర్–ఎస్‌ఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్–ఆర్‌ఏగా ఆమె తమ సేవలు అందించారు.
జేసీబీ, ఐదు ట్రాక్టర్ల సీజ్
రేణిగుంట: మండలంలోని స్వర్ణముఖి నదిలో జేసీబీ సహాయంతో అక్రమంగా ఇసుక లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లతోపాటు జేసీబీని సీజ్ చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ రెడ్డి తెలిపారు. సీఐ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖినదిలో దాడులు చేశామన్నా రు. అక్కడ జేసీబీ సహాయంతో ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుకలోడ్ చేసి రవాణా చేయ డానికి సిద్ధం చేస్తున్న జేసీబీ ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా చేస్తే ఎంతటి వారి పైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ మంజునాథ రెడ్డి హెచ్చరించారు.
టిప్పర్ డ్రైవర్‌పై దాడి
శ్రీకాళహస్తి: సెల్‌ఫోన్ అపహరించబోయిన ఆగంతకుడిని ప్రతిఘటించడంతో టిప్పర్ డ్రైవర్‌పై మద్యం సీసాతో దాడి చేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. చైన్నెకు చెందిన చిన్నరాజ్ శ్రీకాళహస్తి శివారులోని ఓ ప్రైవేట్ క్రషర్‌లో కొద్ది రోజులుగా టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణం వద్ద టిఫిన్ చేసేందుకు వచ్చాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని ఆగంతకుడు చిన్నరాజ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌న్‌ను లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీనిని చిన్నరాజ్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆగంతకుడు తన వద్ద ఉన్న బీరు సీసాతో చిన్నరాజ్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రత్యేక ప్రతిభావంతుల
నైపుణ్యాలు అమోఘం
తిరుపతి సిటీ: ప్రత్యేక ప్రతిభావంతుల్లో అమోఘమైన నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికి తీసి ప్రొత్సహించడం అభినందనీయమని డీఈఓ కేవీఎన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తిరుచానూరు రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. అనంతరం ప్రతిభ చూపిన 60 మంది ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్టు వ్వవస్థాపకురాలు తహసున్సీసా బేగం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్, ఉప విద్యాశాఖాధికారి ఇందిరా దేవి, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బి చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్‌ఓ సారథి, సీఎంఓ సురేష్, తిరుపతి రూరల్ ఎంఈఓ పద్మజ పాల్గొన్నారు.
మహిళా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉష బాధ్యతల స్వీకరణ


