జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ

Jan 9 2026 7:09 AM | Updated on Jan 9 2026 7:09 AM

జాతీయ

జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ

తిరుపతి సిటీ: తమిళనాడు చైన్నె తాంబురం స్పోర్ట్స్‌ వర్సిటీ వేదికగా ఇటీవల జరిగిన 27వ జాతీయ జంప్‌ రోప్‌ చాంపియన్‌షిప్‌లో మంగళం ట్రెండ్స్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులు ఏకంగా ఆరు రజిత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన తొమ్మిదో తరగతి చదువుతున్న కోకిల, జాహ్నవి, జోయల్‌, 8వ తరగతి చదువుతున్న తస్వీజ, రమ్యశ్రీ, జాహ్నవీలను ప్రధానోపాధ్యయులు కేశవుల నాయుడు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, సుభాష్‌ చంద్రదాస్‌, రామచంద్రయ్య పలువురు పాల్గొన్నారు.

జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ 
1
1/1

జాతీయ పోటీలలో మంగళం విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement