ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు
సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండలకేంద్రం సైదాపురం సమీపంలోని గూడూరు మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల రెవెన్యూ పరిఽధిలోని సర్వే నంబర్ 793లో 10.305 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యవరణం అనుమతి కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ కావాలని, తద్వారా తమకు జీవనోపాధి కలుగుతుందని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పలువురు అధికారులకు విన్నవించారు. మరికొందరు మైనింగ్ వద్దంటూ విన్నవించారు. దీంతో సమావేశంలో విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాపూరు సీఐ చినసత్యనారాయణ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్విరాల్‌మెంట్ అధికారి అశోక్ కుమార్, గని యజమాని ఉదయ్‌భాస్కర్, తహసీల్దార్ సుభద్ర, ఆర్‌ఐ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు


