ఈతకు వెళ్లి వలస కార్మికుడి మృతి
– బిహార్ వాసిగా గుర్తింపు
వరదయ్యపాళెం: బతుకు తెరువు కోసం వచ్చిన వలస కార్మికుడు మండలంలోని సంతవేలూరు చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఎస్‌ఐ మల్లికార్జున్ కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం కటిహర్ జిల్లా డిప్రీంసాళెం హరిహర్పూర్న గ్రామాని కి చెందిన సీతారామ్ ఉర్నన్ కుమారుడు రామానంద టర్కీ(20) మండలంలోని కువ్వాకొల్లి సీసీఎల్ కాంటినెంటల్ కాఫీ కంపెనీలో వలస కార్మికుడుగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో తన స్నేహితులతోపాటు సంతవేలూరు చె రువు సమీపంలో మద్యం తాగిన రామానంద టర్కీ సరదాగా ఈత కొట్టడానికి చెరువులో దిగాడు. చెరువు లో ఉన్న పాచి కారణంగా ఇరుక్కుని మునిగిపోవడా న్ని గుర్తించిన తోటి కార్మికుడు అనోజ్ కేకలు వేయడంతో, ఎస్టీకాలనీకి చెందిన నవీన్ చెరువులో దిగి, నీ టమునిగిన అతన్ని ఒడ్డుకు చేర్చాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


