టీటీడీకి రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Jan 8 2026 6:24 AM | Updated on Jan 8 2026 6:24 AM

టీటీడ

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: బెంగళూరుకు చెందిన రాన్‌కి ఇన్‌ఫ్రా సంస్థ అధినేత ఆర్‌ఎం ఈశ్వర్‌ నాయుడు బుధవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్‌ అభినందించారు.

ఫిలిమ్‌ చాంబర్‌ సంయుక్త కార్యదర్శిగా రాజుకుంట వాసి

చిట్వేలి: తెలుగు ఫిలి మ్‌ చాంబర్‌ సంయుక్త కార్యదర్శిగా రాజుకుంటకు చెంది న ఎంపీటీసీ సభ్యు డు నానబాల నాగా ర్జునకు అరుదైన గౌ రవం దక్కింది. బుధవారం తెలుగు ఫిలిమ్‌ చాంబర్‌ సంయుక్త కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో 2017వ సంవత్సరం నుంచి 2023 వరకు సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2025 డిసెంబర్‌ 28వ తేదీన జరిగిన ఫిలిమ్‌ చాంబర్‌ ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న నాగార్జున 2027వ సంవత్సరం వరకు పదవిలో కొనసాగనున్నారు.

కెనరా బ్యాంక్‌ వద్ద

రూ.2 లక్షల చోరీ

సూళ్లూరుపేట: పట్టణంలోని కెనరా బ్యాంక్‌ వద్ద చెంగమ్మ ఆనే మహిళ వద్ద ఉన్న రూ.2 లక్షలు నగదును గుర్తు తెలియని యువకులు మోటార్‌సైకిల్‌ వచ్చి దోచుకెళ్లారు. బాఽధితురాలి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం వేటగిరిపాళెం గ్రామానికి చెందిన చెంగమ్మ పొదుపు గ్రూపు నడుపుతోంది. వారి గ్రూపునకు బ్యాంక్‌ రుణం మంజూరు చేయడంతో ఆ నగదు రూ.2 లక్షలు తీసుకుని బయటకు రాగానే గుర్తు తెలియని యువకులు నగదు సంచినీ లాక్కుని వెళ్లిపోయారు. ఈ విషయమై బుధవారం బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తెలిపారు.

హైవే పట్రోలింగ్‌ వాహనం బోల్తా

– ముగ్గురికి గాయాలు

చంద్రగిరి: జాతీయ రహదారిపై పట్రోలింగ్‌ వాహనం బోల్తాపడిన ఘటన మంగళవారం అర్థరాత్రి చంద్రగిరి మండలంలోని కల్‌రోడ్డుపల్లి వద్ద చోటు చేసుకుంది. జాతీయ రహదారికి చెందిన పట్రోలింగ్‌ వాహనం విధుల్లో భాగంగా చంద్రగిరికి వైపు వస్తోంది. ఈ క్రమంలో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుపైకి దూసుకెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చరణ్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు

రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ఉన్న రాస్‌ కృషి విజ్ఞాన కేంద్రాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రధాన శాస్త్రవేత్తలు డా.శ్రీదేవి, డా. పీసీ లత, డా.మధుసూదన్‌ రావు బుధవారం సందర్శించారు. ముందుగా వారు కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. దత్తత గ్రామాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని వాటి ప్రభావం గురించి తెలుసుకుని శాస్త్రవేత్తల పనితీరు, కార్యక్రమాల ప్రగతిని ప్రశంసించారు. తరువాత కృషి విజ్ఞాన కేంద్రంలోని పంట క్షేత్రంలో వివిధ ఆహార, ఉద్యాన పంటల ప్రదర్శన క్షేత్రాలు, భూసార పరీక్ష కేంద్రం, వివిధ రకాల నర్సరీలు, వర్మీకంపోస్ట్‌ తయారీ కేంద్రం, పుట్టగొడుగుల ఉత్పత్తి కేంద్రం, పెరటికోళ్ల పెంపకం తదితర ప్రదర్శన క్షేత్రాలు సందర్శించి, జిల్లా నేలల స్వభావంపై పరిశోధన కోసం కేవీకే క్షేత్రంలో మట్టి నమూనాలు సేకరించి, కేవీకే దత్తత గ్రామాలను సందర్శించి, అక్కడ రైతులతో సమావేశమం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్‌ శాస్త్రవేత్త డా.ఎస్‌.శ్రీనివాసులు, కేవీకే శాస్త్రవేత్తలు దివ్య, రాము కుమార్‌, అనూష, దివ్య సుధ, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీకి రూ.10 లక్షల విరాళం 1
1/2

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

టీటీడీకి రూ.10 లక్షల విరాళం 2
2/2

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement