వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్: మండలంలోని నరసారెడ్డికండ్రిగ సమీపంలో బుధవా రం గుర్తు తెలియని వాహ నం ఢీకొని గుర్తు తెలి యని వ్యక్తి మృతి చెందా డు. జాతీయ రహదారి పక్కన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. సుమా రు 45 ఏళ్ల వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు భిక్షగాడిగా పోలీసులు భావిస్తున్నారు. అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నా రు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భద్రపరచి కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ ఎన్నిక
తిరుపతి కల్చరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరు పతి జిల్లాకు చెందిన ఇద్దరిని వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగం కమిటీ ప్రతినిధులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన బి.నరహరిరెడ్డి, రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం సహాయ కార్యదర్శిగా చంద్రగిరికి చెందిన ఆర్.దేవరాజులు నియమితులయ్యారు.
నియామకం
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా శ్రీకాళహస్తికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా గ్రంథాలయాల చైర్మ న్ల నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కారు సహా ఎర్రచందనం స్వాధీనం
భాకరాపేట: తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఎరచ్రందనం దుంగలను, కారు సహా అటవీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అటవీ రేంజర్ వెంకటరమణ కథనం మేరకు.. శ్రీనివాసమంగాపురం సమీప ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలను తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారనట్లు అటవీశాఖాధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో వారు శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆ సమయంలో ఓ కారు అటువైపు రావడంతో దాన్ని అటవీశాఖాధికారులు ఆపారు. దీంతో కారు వదలి అందులోని వ్యక్తులు పరారయ్యారు. అధికారులు ఆ కారులో పరిశీలించగా 9 ఎర్రచందనం దుంగలు ఉండగా గుర్తించి, వాహనం సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 280 కిలోల బరువు ఉన్న వీటి విలువ సుమారు రూ.13 లక్షలుగా అంచనా వేశా రు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చైతన్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి, డ్రైవర్ శంకర్, ప్రొటెక్షన్ వాచర్లు కుమార్, అంజన్ కుమార్, సురేంద్ర, హేమచంద్ర, యుగంధర్ పాల్గొన్నారు.


