సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ

Jan 8 2026 6:24 AM | Updated on Jan 8 2026 6:24 AM

సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ

సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ

తిరుపతి కల్చరల్‌: రేణిగుంట క్యారేజ్‌ రిపేర్‌ షాప్‌(సీఆర్‌ఎస్‌) ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దెల గురుమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సీఆర్‌ఎస్‌ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల సమస్యలను సా నుకూలంగా విన్న ఎంపీ గురుమూర్తి త్వరలోనే రేణిగుంట సీఆర్‌ఎస్‌ను స్వయంగా సందర్శించి సంబంధి త రైల్వే అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement