ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇన్నోవేషన్ సెంటర్ మంజూరు
తిరుపతి సిటీ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి పెంపుకోసం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ సెంటర్‌ను మంజూరు చేసింది. కళాశాలలో బుధవారం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్నోవేషన్ సెంటర్ ధృవీకరణ పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అకడమిక్ విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగు పరచుకునేందుకు కళాశాలకు కేంద్రం ఇన్నొవేషన్ సెంటర్‌ను మంజూరు చేయడం గర్వకారణమన్నారు. నైపుణ్యాభివృద్ధితో పాటు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసి నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్టార్టప్‌లతో పాటు ఫాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, వర్క్ షాప్‌లు పెద్ద సంఖ్యలో నిర్వహించేందుకు వీలుంటుందన్నారు. సెంటర్ రావడానికి కృషి చేసిన సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె ఉమారాణిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కిషన్, భీమన్న, మల్లికార్జున, చలపతి, కామేశ్వరరావు, ఉష, విజయశ్రీ, రత్నారావు, మార్కండేయ, రామకృష్ణరెడ్డి పాల్గొన్నారు.


