ఆలయాల్లో చోరీలు
కలువాయి(సైదాపురం): మండలంలోని దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతుండడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పెన్న బద్వేల్ గ్రామంలోని శివాలయం, కామాక్షి అమ్మవారి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి సీసీ కెమెరాలు, తాళాలు ధ్వంసం చేసి అమ్మవారి రెండు మంగళ సూత్రాలు దోచుకెళ్లారని పూజారి సురేంద్రనాథ్ తెలిపారు. ఉదయాన్నే గుడిలోకి వెళ్లిన పూజారి చోరీ విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
నాగలాపురం: ద్విచక్ర వాహనాన్ని టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఓ వ్యకికి తీవ్ర గాయాలైన ఘటన పిచ్చాటూరు మండలంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తొట్టంబేడు మండలం బసవమ్మ గుంట ఎస్టీ కాలనీకి చెందిన దొరబాబు(31) ద్విచక్రవాహనంలో తన సొంత పనుల నిమిత్తం పిచ్చాటూరు బైపాస్ మీదుగా పుత్తూరు బయలు దేరాడు. ఆ సమయంలో పిచ్చాటూరు బైపాస్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చైన్నె మీదుగా వెళుతున్న టాటాఏస్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో స్కూటరిస్టు గాయపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొరబాబును ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టాటాఏస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిచ్చాటూరు ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు.
విద్యుత్ స్టార్టర్ల చోరీ
పెళ్లకూరు: మండలంలోని భీమవరం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు ఉన్న సుమారు 70 విద్యుత స్టార్టర్లును మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు సాగునీటి కోసం వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ స్టార్టర్లును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
పాకాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కె.వడ్డేపల్లి పంచాయతీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కే.వడ్డేపల్లి పంచాయతీ బావిలో బోరు మోటారు పని చేయకపోడంతో మెకానిక్ రాజారత్నంను పిలిపించారు. బావిలో మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మోటారుతో పాటు బావిలో మునిగిపోయి రాజరత్నం(39) మృతి చెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. పాకాల పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
ఆలయాల్లో చోరీలు
ఆలయాల్లో చోరీలు


