ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఏపీ టూరిజం బస్సుయాత్ర
తిరుపతి అన్నమయ్యసర్కిల్:జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ నెల 10,11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా తిరుపతి నుంచి బస్సు ప్యాకేజీ టూర్‌ను నడుపుతున్నట్లు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజనల్ మేనేజర్ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులు ఉదయం 8 గంటలకు బయలుదేరి తిరిగి సాయంత్రం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. ఈ ప్యాకేజ్ టూర్‌లో నేలపట్టు, అటకాని తిప్ప, సూల్లూరు పేట ఫ్లెమింగో ఫెస్టివల్ సెంటర్, శ్రీ చెంగాళమ్మ ఆలయం, శ్రీసిటీ, బీవీ పాళెం ప్రదేశాలను సందర్శించవచ్చన్నారు. ఒకరికి రూ.550 (నాన్ ఏసీ రవాణా చార్జీలు, గైడ్ సౌకర్యంతో కలిపి) ఽటికెట్టు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ యాత్ర బస్సులు తిరుపతిలోని శ్రీనివాసం (టీటీడీ), విష్ణునివాసం (టీటీడీ) నుంచి బయలుదేరుతాయని, వివరాలకు 0877–2289123, 9848007033 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఎట్టకేలకు కాన్వికేషన్ నోటిఫికేషన్ విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు ఎట్టకేలకు 63 నుంచి 68వ కాన్వొకేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వర్సిటీ పరిధిలో 2018 నుంచి 2024 వరకు యూజీ, పీజీ, పీహెచ్‌డీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కాన్వొకేషన్ పట్టాకోసం దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వచ్చేనెల 20వ తేదీలోపు వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.


