అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పంచాయతీ, నీలసానిపేటలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రేణిగుంట రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలోని గాజుల మండ్యం ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి నిల్వ చేసి, అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం నీలసానిపేటలో తనిఖీలు నిర్వహించారు. ఒక ఇంట్లో సుమారు 100 బస్తాల రేషన్ బియ్యం ఉండడం గుర్తించి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో సీజ్ చేశారు. తరువాత గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌కు రేషన్ బియ్యాన్ని తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలు అదృశ్యం
వరదయ్యపాళెం: మండలంలోని రా మిరెడ్డిపాళేనికి చెందిన తలారి సుబ్బ య్య భార్య ఎస్. మునివెంకటమ్మ (60) పది రోజుల కిందట అదృశ్యమైనట్లు వరదయ్యపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఇంటికి చేరుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ మల్లికార్జున సూచించారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత


