గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

గొలుసు చోరీ

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

గొలుస

గొలుసు చోరీ

పుల్లంపేట: మండలకేంద్రంలో నడిచి వెళుతున్న మహిళమెడలో గొలుసు ఓ యువకుడు లాక్కొ ని పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు.. రాజంపేట మండలం మందరం హరిజనవాడకు చెందిన సిగమాల అన్నపూర్ణమ్మ నెలక్రితం కువైట్‌ నుంచి వచ్చింది. ఈ క్రమంలో మండలంలోని రామక్కపల్లె హరిజనవాడలో ఉన్న తన అక్క ఇంటికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం తన అక్కతో కలిసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి వస్తుండగా పుల్లంగేరు పాతబ్రిడ్జి దాటి గ్రామంలోకి రాగానే ముసుగు ధరించిన యువకుడు బైక్‌పై వచ్చి మహిళమెడలోని 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.

10 మంది పందెంరాయుళ్ల అరెస్టు

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని కంచనపుత్తూరులో ఆదివారం రాత్రి కోడి పందెం ఆడుతున్న 10 మందిని ఎస్‌ఐ హరిప్రసాద్‌, సిబ్బందితో కలసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 27,010 నగదు, రెండు కోళ్లును స్వాధీనం చేసు కున్నారు. పలువురు పరారయ్యాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామని, కోడి పందెలు, పేకాట తదితర జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కారు డ్రైవర్‌కు జైలు

తిరుపతి లీగల్‌: కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన కేసులో తిరుపతి, నెహ్రూనగర్‌ కు చెందిన కారు డ్రైవర్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ కు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్‌ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు ఏపీపీ జయ శేఖర్‌ కథనం మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్‌ రోడ్డులో 2018 ఏప్రిల్‌ 9వ తేదీ నిందితుడు కిరణ్‌ కుమార్‌ కారును అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ కంట్రోల్‌ తప్పి శ్రీ వినా యక స్వామి దేవాలయం వద్ద రోడ్డుకు ఎడమ పక్కన కారు ఆపి దిగివున్న తమిళనాడు, కృష్ణగిరి జిల్లా, సులగిరి తాలూకా, కల్లుకురి గ్రామానికి చెందిన ఎం. మునికృష్ణప్ప, ఆయన కుమారుడు కృష్ణప్పను ఢీకొన్నాడు. దీంతోపాటు వారి కారు ను ఢీకొన్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. టీటీడీ అంబులెన్స్‌ లో ఇద్దరిని రుయా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మునికృష్ణప్పను బెంగళూరుకు తరలిస్తుండగా మార్గం మ ధ్యలో 2018 ఏప్రిల్‌ 9వ తేదీన మృతి చెందాడు. దీనిపై తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు కార్‌ డ్రైవర్‌ ఎం కిరణ్‌ కుమార్‌, కారు యజమాని పి రత్న మ్మపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ దశలో రత్నమ్మ మృతి చెందారు. నేరం రుజువు కావడంతో కిరణ్‌ కుమార్‌ కు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

రైల్వేకోడూరు అర్బన్‌ : బంగారం చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓబులవారిపల్లి మండలం బొంతనవారిపల్లిలో గత డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి విజయమ్మ, ఇందిరమ్మ తమ ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై దాడి చేసి 75 గ్రాముల బంగారు నగలు, 36 వేలు నగదు దో చుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరిని రేణిగుంట సమీ పంలో అరెస్టు చేశారు. సోమవారం తిరుపతి డీ ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో నిందితులను హాజరు పరిచారు. డీఎస్పీ మాట్లాడుతూ తక్కు వ సమయంలో చోరీ కేసును ఛేదించడం అభినందించ దగ్గ విషయమన్నారు. చోరీకి పాల్పడి న ముగ్గురు నిందితుల్లో డేరంగుల వంశీ, పుల్లగంటి గంగాధర్‌ను అరెస్టు చేసి వారివద్ద నుంచి బంగారు నగలు, నగదు, సెల్‌, మోటార్‌సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పుల్లగంటి ప్రభాకర్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీ ఐ డీశ్రీనివాసులు, ఎస్‌ఐలు మహేష్‌, లక్ష్మీప్రసా ద్‌రెడ్డి, సిబ్బంది రమణ, కార్తీక్‌, రాఘవేంద్ర, అ నిల్‌కుమార్‌, మల్లికార్జునను అభినందించారు.

గొలుసు చోరీ 1
1/2

గొలుసు చోరీ

గొలుసు చోరీ 2
2/2

గొలుసు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement