అర్జీదారులకు సమాధానం చెప్పండి
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు 425 అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్‌మాండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
తనిఖీలు..
నీటి ద్రోహంపై నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను కార్యక్రమం నేపథ్యంలో పెద్ద ఎత్తున సోమవారం కలెక్టరేట్‌కు పోలీసులు విచ్చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారులను ఏ సమస్యపై వచ్చారు..ఎంత మంది వచ్చారంటూ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దే పోలీసులు అడ్డుకుని విచారణ చేపట్టారు. దీంతో పలువురు అర్జీదారులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పింఛన్ ఇప్పిచండి
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తనకు పింఛన్ ఇప్పించాలని కేవీబీపురం మండలం బైబాసి కండ్రిగకు చెందిన వెంకటమ్మ ప్రాథేయపడింది. తన భర్త మృతి చెందాడంతో తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కన్నెమ్మ వద్ద ఉంటున్నానని చెప్పారు. తనకు ఓ చిన్న బిడ్డ కూడా ఉన్నాడని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వితంతువైన తనకు పింఛన్ ఇస్తే ఆ డబ్బులతో వైద్య ఖర్చులు చేయించుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.
కరుణించండి
తమ పాప మోక్షిత మానసిక రోగి కావడంతో తాము ఇక్కట్లు పడుతున్నామని, తమకు పింఛన్ ఇచ్చి, కరుణించాలని తిరుపతి జీవకోనకు చెందిన ఆ పాప తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం అర్జీ సమర్పించారు.


