రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు

Jan 4 2026 11:12 AM | Updated on Jan 4 2026 11:12 AM

రిపబ్

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు

తిరుపతి సిటీ: ఢిల్లీ వేదికగా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌ డే సందర్భంగా జరగనున్న ప్రతిష్టాత్మ పరేడ్‌కు తిరుపతి ఎన్‌సీసీ 2ఏ ఆర్‌ అండ్‌ వీ రెజిమెంట్‌కు చెందిన ముగ్గురు ఎన్‌సీసీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్న బి ఆనంద్‌, టి త్రివేణితో పాటు వెటర్నరీ కళాశాలల్లో ఫైనల్‌ ఇయర్‌ బీవీఎస్సీ చదువుతున్న దినేష్‌ కుమార్‌ ఉన్నారు. హార్స్‌రైడింగ్‌లో పలు విభాగాలల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు.

హెల్త్‌కేర్‌లో బొప్పన సాయి హారికకు అవార్డు

వరదయ్యపాళెం: ఆడియాలజీ, స్పీచ్‌, లాంగ్వేజ్‌, పాథాలజీలో తన బలమైన నేపథ్యం కలిగి స్పీచ్‌ థెరపిస్ట్‌గా తన వృత్తి జీవనాన్ని ప్రారంభించిన వరదయ్యపాళేనికి చెందిన బొప్పన సాయిహారిక జాతీయ స్థాయి హెల్త్‌కేర్‌లో టాప్‌ టెన్‌ స్థానంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల్లో ఆమెకు స్థానం లభించింది. బెంగళూరుకు చెందిన ఉమెన్‌ ఎంటర్‌ప్రేనియస్‌ మ్యాగ్‌జైన్‌ నిర్వహించిన అధ్యయనంలో ఆ సంస్థ మేనేజింగ్‌ ఎడిటర్‌ రచిత శర్మ బొప్పన సాయి హారికకు అవార్డు అందజేసినట్లు ఆమె తెలిపారు. వరదయ్యపాళేనికి చెందిన బొప్పన రమేష్‌ ప్రథమ కుమార్తె బొప్పన సాయి హారిక బెంగళూరులో 8 సంవత్సరాల వయ స్సు గల పిల్లల కోసం పూర్తిస్థాయి చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ అందించే విప్లవాత్మక సంస్థ త్రిశూల్‌ సంస్థ వ్యవస్థాపకురాలు, సంస్థ సీఈఓగా ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆమెకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో వరదయ్యపాళెంలో ప్రముఖులు, స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు 1
1/3

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు 2
2/3

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు 3
3/3

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement