సైనిక్, నవోదయ కోచింగ్‌లో అగ్రగామి విశ్వం
తిరుపతి సిటీ: సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల కోచింగ్‌లో విశ్వం విద్యాసంస్థ జాతీయస్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని ఎమ్మె ల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడా రు. శనివారం వరదరాజనగర్‌లోని విశ్వం టాలెంట్ స్కూల్‌లో ఈనెల 18వ తేదీన జరగనున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2026కు సంబంధించిన మాక్ టెస్ట్ బుక్లెట్‌ను ఆయన, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ వి శ్వనాథ్‌రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష అనగానే తల్లిదండ్రులు, పిల్లలకు గుర్తు వచ్చే కోచింగ్ సెంటర్ కేవలం విశ్వమేనన్నారు. 2025 సైనిక్ స్కూల్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు మొత్తం 63 సీట్లు, నవోదయ ఫలితాల్లో 61 సీట్లు సాధించి విశ్వం విద్యా సంస్థలు విజయభేరి మోగించాయని తెలిపారు. విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడు తూ గత 35 ఏళ్లలో సైనిక్ ఫలితాల్లో 66 రాష్ట్రస్థాయి ప్ర థమ ర్యాంకులతో పాటు మొత్తం 967 సీట్లు సాధించి కోచింగ్ రంగంలో రికార్డు సృష్టించామన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్‌తో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.


