మహిళా వర్సిటీలో 23మందికి ఉద్యోగోన్నతి
తిరుపతి రూరల్:మహిళా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(సీఏఎస్) కింద 23 మంది బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ వైస్ చాన్స లర్ ఆచార్య ఉమ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి ఉత్తర్వులను వైస్ చాన్స్‌లర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని అధ్యాపకులకు అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగోన్నతికి ఆమోదం తెలపడంతో ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. బోధన, పరిశోధన, విద్యా సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పించినట్లు వీసీ ఉమ తెలిపారు.


