కుందన సాయికి ఇన్నోవేషన్ అవార్డు
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఎస్‌ఎస్‌ఐఐఈ, టీబీఐ ఇన్నోవేటర్ డి.కుందన సాయికి ఇన్నోవేషన్ అవార్డు లభించింది. ఆమె ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కలుషితమైన నీటిని శుద్ధి చేసే లక్ష్యంతో ఆల్గల్ ఆధారిత నీటి పునరుజ్జీవన పరికరం నమూనాను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో ఈ నెల 24న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా ఆమెకు అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఆమెను వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజిని, డాక్టర్ జే సూర్యకుమర్ అభినందించారు.
తిరుచ్చిపై సిరులతల్లి విహారం
తిరుపతి రూరల్ : తిరుచానూరు పద్మావతీదేవి బంగారు తిరుచ్చిపై విహరించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కుందన సాయికి ఇన్నోవేషన్ అవార్డు


