ముగిసిన ‘పది’ మూల్యాంకనం
తిరుపతి అర్బన్ : తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, అనకాపల్లి, పల్నాడు, కోనసీమ జిల్లాలకు చెందినన విద్యార్థుల జవాబు పత్రాలను తిరుపతిలో మూల్యాంకనం చేశారు. జిల్లాకు చెందిన వివిధ సబ్జెక్టుల టీచర్లను నియమించి మూల్యాంకనం ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశారు. ప్రతిరోజూ ఓఎంఆర్ షీట్లను సీల్ చేసి, పటిష్ట భద్రత నడుమ విజయవాడకు తరలించారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ డీవైఈఓ బాలాజీ, ఎంఈఓ భాస్కర్, ఏఈ గురవారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి.శిరీష్ కుమార్ ఆధ్వర్యంలో పకడ్బందీగా పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆర్జేడీ శామ్యూల్ స్పాట్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు.


