హనుమపై కోదండరాముని విహారం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం ఉదయం సర్వాంగ సుందర రూపుడై శ్రీకోదండరామస్వామి తన ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి గజవాహన సేవ వేడుకగా సాగింది. పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
హనుమపై కోదండరాముని విహారం


