రేపటి నుంచి పంచాయతీల్లో ఉచిత పశువైద్య శిబిరాలు
తిరుపతి అర్బన్: ప్రతి పంచాయతీలో ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశువైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రవికుమార్ తెలిపారు. శనివా రం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 36 మండలాల్లోనూ సోమవారం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఒక్కొక్క రోజు రెండు పంచాయతీల చొప్పున ఆయా మండల పశువైద్యాధికారి పర్యవేక్షణలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పశువు లు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలనతోపాటు అవసరం అయిన మేరకు మందులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. పాడి రైతులు పశు వైద్య శిబిరాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ రోజు ఏ పంచాయతీలో ఉంటుందన్న సమాచారాన్ని ముందుగానే ప్రతి పంచాయతీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదంలో
బాలుడి మృతి
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలోని దేవరకొండ–భాకరాపేట రహదారిపై బోడిరెడ్డిగారి పల్లి బస్‌స్టాండ్ సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. దేవరకొండ నుంచి భాకరాపేట వైపు ట్రాక్టర్ వెళుతున్న ట్రాక్టర్, మోటార్ సైకిల్‌పై మైలవాండ్లపల్లెకు చెందిన వేముల లోకేష్ (24), షేక్‌సుల్తాన్ వెళుతుండగా వారిని ఢీకొంది. ఈ ఘటనలో వెనుక కూర్చుని ఉన్న షేక్ సుల్తాన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన లోకేష్‌ణు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిట్టేచర్ల గ్రామానికి చెందిన సాడు పవన్ కుమార్ (27) ట్రాక్టర్ డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
తిరుపతి క్రైమ్: నగరంలో నివాసముంటున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అలిపిరి పోలీసుల కథనం మేరకు.. సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న తులసీరామ్(25) హోటల్లో రూమ్‌బాయ్ గా పని చేస్తున్నాడు. ఇటీవల అతనికి ఓ మహిళతో ప్రేమ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు రావడంతో మృతుడు భార్య తండ్రితో కలిసి మృతుడి ఇంట్లోనే ఉండేది. అయితే ఏమైందో ఏమో కానీ శనివారం తెల్లవారుజామున తులసి రామ్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు అన్న జోషి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
రేపటి నుంచి పంచాయతీల్లో ఉచిత పశువైద్య శిబిరాలు


