సైనిక్, నవోదయ– 2026 బ్రోచర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విశ్వం సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల– 2026 బ్రోచర్‌ను ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి, ఎన్ విశ్వశ్రీ ఆవిష్కరించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2025 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకుతో పాటు 63 సీట్లు, అలాగే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో 69 సీట్లు సాధించి విశ్వం విద్యాసంస్థ రికార్డు సృష్టించడం గర్వించదగ్గ విషయమన్నారు. గత 35 ఏళ్లుగా సైనిక్, నవోదయ స్కూల్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులు సాధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందాయని కొనియాడారు. అనంతరం డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 46 రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులతో పాటు మొత్తం 967 సీట్లు సాధించడం శిక్షణ రంగంలో ఒక అరుదైన రికార్డు అని పేర్కొన్నారు. సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలపై మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


