ఐసర్‌లో ఆకట్టుకున్న ‘విరాసత్’ సంగీత కచేరీలు
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో స్పిక్ మాకే సహకారంతో ‘విరాసత్–2026’ పేరుతో జరుగుతున్న సంగీత కచేరీ, వర్క్‌షాప్‌లు ఆకట్టుకున్నాయి. ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విభిన్న, సంస్కృతులు, కళలను మేళవించి, దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రెండవరోజు శనివారం ఐసర్ ప్రాంగణంలోని కొలీజియం హాల్‌లో సాయంత్రం విద్వాన్ అమృత మురళి కర్ణాటక సంగీత కచేరీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కచేరీలో వయోలిన్‌పై విద్వాన్ ఆర్‌కె శ్రీరామ్‌కుమార్, మృదంగంపై విద్వాన్ మనోజ్ శివ, కంజీరపై విద్వాన్ కేవీ గోపాలకృష్ణన్ సహకారం అందించడంతో శాసీ్త్రయ నృత్య ప్రదర్శన సభికులను కట్టిపడేసింది.


