ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
– 8లో
రేణిగుంటలో శనివారం రాజంపేట నుంచి తిరు పతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మద్యం మత్తులో యువకులు దాడి చేశారు.
సేవలు శూన్యం
చంద్రగిరి నియోజకవర్గంలో సంచార పశువైద్య సేవలు అందడం లేదు. ఎప్పుడు చూసినా పాడైపోయిందంటున్నారు. వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. పశువులు, పొలం వద్ద లేదా రోడ్లుపై అనారోగ్యంతో నడవలేకపోతే వాటిని తరలించడం కష్టంగా ఉంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో సంచార వాహనం ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉంచేశారు. దీంతో సేవలు అందడం లేదు.
– రాజారెడ్డి, చిన్నగొట్టిగల్లు, పాడిరైతు
అందని సంచార పశువైద్యం
వైఎస్సార్ సీపీ హయాంలో పశువులకు గ్రామాల్లోనే వైద్యంతో పాటు అత్యవసర సమయాల్లో సహాయ చర్యలు అందేలా వైఎస్సార్ పశు సంచార ఆరోగ్య వాహనం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాడి రైతులకు ఇంటి ముంగిటకే పశువులకు వైద్య సేవలు అందాయి. చంద్రబాబు అధికారంలో వచ్చిన తరువాత గ్రామాల్లో సంచార వైద్యం పూర్తిగా అందకుండాపోయింది.
– రాజశేఖర్, పాడిరైతు, డీవీ సత్రం
సేవల కోసం ఎదురుచూపులు
గత ప్రభుత్వం సంచార పశువైద్య వాహన సేవల ను అమలు చేసింది. పశువులు వ్యాధి బారిన పడిన వెంటనే 1962కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారు లు ఆయా గ్రామాల్లోకి వచ్చి వైద్యసేవలు అందించేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం పాతవిధానానికి స్వస్తి పలికి నెలలో ఆరు రోజులు మాత్రమే మండలంలోని గ్రామాల్లో పర్యటించేలా ఆదేశాలు జారీ చేశారు. పాడిరైతులకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేకుండాపోయింది.
– పోలి.రమణయ్య, పాడి రైతు, పుల్లంపేట


