మొక్కుబడిగా సంచారవైద్య సేవ
ఏర్పేడు: గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్యసేవ పాడిరైతులకు దూరమైంది. వాహనాలు ఉత్సవ విగ్రహాలుగా మారి కార్యాలయాలకే పరిమితం అయ్యాయి. దీంతో అత్యవసర సమయంలో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కనిపిస్తోంది. నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిధిలోని గ్రామాలకు శ్రీకాళహస్తిలో, ఏర్పేడు, రేణిగుంట మండలాలకు రేణిగుంటలో సంచార పశువైద్య వాహనాలున్నాయి. అయితే పాడి పశువులకు ఏదైనా జబ్బు చేసి విషమ పరిస్థితి తలెత్తితే తప్ప వాహనాలు గ్రామాల్లో తిరగడం లేదు.


