అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అభిమానుల మధ్య వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ విజయమ్మకు వైఎస్ షర్మిల తినిపించారు. లక్ష్మీదేవిపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్లలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా