
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ.. యువకులు ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. హయత్‌నగర్‌లో బైక్ స్టంట్‌లు యువకుడి ప్రాణాలు తీశాయి. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు.
వర్షం కురుస్తున్న సమయంలో కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు స్టెంట్‌లు చేస్తుండగా.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. చేతికందిన కుమారుడు మృతిచెందాడన్న వార్త జీర్ణించుకోలేక ఆ కన్నతల్లి పెట్టిన రోదన అక్కడివారిని కలిచివేయించింది.