'48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్‌ షేర్‌ చేస్తా' | Wife missing: Husband Goes into Hiding with Children in Vikarabad | Sakshi
Sakshi News home page

'48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్‌ షేర్‌ చేస్తా'

Jun 25 2022 2:37 PM | Updated on Jun 25 2022 3:42 PM

Wife missing: Husband Goes into Hiding with Children in Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. పోలీసులు వైఫల్యంతో తన భార్య ఆచూకీ లభించడం లేదని ఆరోపిస్తున్నారు. తన భార్య అన్నపూర్ణ అదృశ్యమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మనోవేదనకు గురై తన పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లుగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనిపెట్టకపోతే తమ శవాల లొకేషన్‌ షేర్‌ చేస్తానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

చదవండి: (రాకేశ్‌ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్‌ ఉత్తర్వులు జారీ)

Advertisement
 
Advertisement
Advertisement