హైదరాబాద్ : ముదిరాజ్ కులస్తులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని ముదిరాజ్ జాగృతి సమితి ఫౌండర్ కలకండ శ్రీనివాస్ అన్నారు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముదిరాజ్ జాగృతి సమితిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాగృతి సమితి ద్వారా ముదిరాజ్‌లను జాగృతం చేయడంతో పాటు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ముదిరాజ్ కులస్తులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో చైతన్యం నింపడంతో పాటు సాంప్రదాయ జీవనోపాధిని ప్రోత్సహిస్తూనే పేద విద్యార్థులకు సాయం చేస్తామని అన్నారు. తొలి విడతగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు కమిటీలు వేయడంతో పాటు డివిజన్ స్థాయిలో కూడా కమిటీలను వేస్తామని తెలిపారు.


