Omicron Variant In Hyderabad: ఒకే రోజు 14 ఒమిక్రాన్‌ కేసులు  

Two Victims Of Omicron Variant Has Missing - Sakshi

ఆరుగురి ఆచూకీపై అస్పష్టత 

రాష్ట్రంలో మొత్తం 38 మంది ఒమిక్రాన్‌ బాధితులు 

నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చినవారే అధికం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 14 మం దిలో రిస్క్‌ దేశంగా గుర్తించిన యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఇద్దరుండగా.. నాన్‌ రిస్క్‌ దేశాలుగా పేర్కొన్న కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా 11 మంది పురుషులున్నారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల సంఖ్య 38కి చేరింది. మొత్తం 38 కేసుల్లో 31 మంది నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఆరుగురు రిస్క్‌ దేశాల నుంచి రాగా.. తొలిసారిగా ఒక రికి తెలంగాణలో ఒమిక్రాన్‌ సోకింది.  

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు 4 కేసులు
 నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వస్తున్న వారిలో కేవలం 2% మందికే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. మిగతా వారికి టెస్టులు చేయడం లేదు. టెస్టులు చేసిన వారిని కూడా ఫలితం వచ్చే వరకు ఉంచకుండా కేవలం శాంపిల్స్‌ సేకరించి పంపేస్తున్నారు. ఈ విధంగా బయటకు వస్తున్న వారిలో ఎంతమందికి ఒమిక్రాన్‌ సోకి ఉంటుందో, వారెంత మందికి వ్యాపింపజేసి ఉంటారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇలావుండగా.. తాజాగా నమోదైన 14 కేసుల్లో ఆరుగురి ఆచూకీ ఇంకా కనిపెట్టలేదని సమాచారం. ఇక బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన 259 మంది ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో నలుగురికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉందా లేదా అని నిర్ధారించేందుకు నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు రిస్క్‌ దేశాల నుంచి 9,381 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు.  

కొత్తగా 182 కరోనా కేసులు 
రాష్ట్రంలో కొత్తగా 182 కోవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,074కు పెరిగింది. మహమ్మారి కారణంగా ఒకరు మరణించగా మొత్తం మృతుల సంక్య 4,017కు చేరింది. తాజాగా 196 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా... మొత్తంగా 6,72,447 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top