సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం

TS Intermediate Exam Paper Sanskrit instead of Hindi Question Paper Given In Jangaon - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో సిబ్బంది సంస్కృతం బదులు.. హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటన జనగామ జిల్లా నమిలిగొండ శివా రు మోడల్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌కు చెందిన హర్షి త శనివారం సంస్కృతం పేపర్‌ రాసేందుకు నమిలిగొండ శివారు మోడల్‌ స్కూల్‌లోని పరీక్ష కేంద్రానికి హాజరైంది. ఆమెకు ఇన్విజిలేటర్‌ సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు.

అది తన సబ్జెక్ట్‌ కాదని తెలిసినా.. ఏం చేయాలో తోచక సదరు విద్యార్థిని పరీక్ష ముగిసే వరకు కూర్చుండిపోయింది. బయటకు వచ్చాక తండ్రికి విషయం చెప్పగా.. ఆయన సిబ్బందికి, సెంటర్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ డీఐవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top