ఎంపీ సంతోష్‌కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్‌ గ్రీన్‌ అవార్డ్‌’

TRS MP Joginapally Santosh Kumar Gets Saalumarada Thimmakka National Green Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ‘సాలుమారద తిమ్మక్క నేషనల్‌ గ్రీన్‌ అవార్డు’ అందుకున్నారు. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించు కొని బెంగళూరు డా‘‘బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వృక్ష మాత ఆమె చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. సాలుమారద తిమ్మక్క ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (కర్ణాటక) సంయుక్తంగా ఇచ్చే ఈ అవార్డుకు ప్రకృతి పరిరక్షణ విభాగంలో 2020 సంవత్సరానికి సంతోష్‌ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ.. ఈ నేల భవిష్యత్‌ తరాలకు అందకుండా పోతుందేమోనని ఆవేద నతో స్పందించే ప్రతీ హృదయానికి, ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రతీ ఒక్క రికి ఈ అవార్డును అంకితం చేస్తున్న. ఇది నా బాధ్యతను మరింత పెంచింది’ అని చెప్పారు.  తనతోపాటు అవార్డు అందుకున్న ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ ఎ.ఎస్‌.కిరణ్‌ కుమార్, ప్రముఖ నిర్మాత రంగనాథ్‌ భరద్వాజ్, ప్రముఖ విద్యా వేత్త గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానీలకు శుభాకాం క్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top