రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఎమ్మెల్యే వార్నింగ్‌.. ఆడియో లీక్‌ కలకలం..

TRS MLA Rathod Babu Rao Serious Warning To Real Estate Trader - Sakshi

సాక్షి, బోథ్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు.. బెదిరింపుల ఆడియో బయటకు లీక్‌ అవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బోథ్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాపురావు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వద్ద మధ్యవర్తి సాయంతో కొంత భూమి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారి కిరణ్‌.. సదరు మధ్యవర్తిని భూమికి సంబంధించి రూ.28 లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో, అతను ఎమ్మెల్యే బాపురావును ఆశ్రయించడంతో ఎమ్మెల్యే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఫోన్‌ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కిరణ్‌కు బెదిరింపులకు గురిచేశాడు. వెంచర్‌ ఎలా వేశావ్‌.. ప్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చాడు. 

ఇక, ఎమ్మెల్యే బెదిరింపుల అనంతరం రియల్‌ ఎస్టేట్‌ కిరణ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు కోరినట్టు సమాచారం. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ నడుస్తోంది.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top