వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు | traffic diversions in hyderabad srirama navami | Sakshi
Sakshi News home page

వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Mar 26 2026 4:34 PM | Updated on Mar 26 2026 5:25 PM

traffic diversions in hyderabad srirama navami

హైదరాబాద్‌: "శ్రీరామనవమి శోభాయాత్ర" సందర్భంగా హైదరాబాద్‌లో రేపు (మార్చి 27న) ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో తెలిపారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు వర్తిస్తాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు శోభాయాత్ర ఉంటుంది.

ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు  
1. సీతారాంబాగ్ ఆలయం: ఆసిఫ్ నగర్ నుంచి భోయిగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి, మెహదీపట్నం వైపు మళ్లిస్తారు.

2. ఫ్రెండ్స్ కేఫ్: అఘాపురా, భోయిగూడ కమాన్ బై-లేన్ల నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ భోయిగూడ కమాన్ వద్ద అఘాపురా హబీబ్ నగర్ వైపు మళ్లిస్తారు..

3. భోయిగూడ కమాన్: దారుసలాం నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ఘోడే-కీ-ఖబర్ లేదా కొత్త అఘాపురా, చార్‌కందిల్ ఎక్స్ రోడ్, నాంపల్లి వైపు మళ్లిస్తారు.

4. భోయిగూడ కమాన్ కుడి మలుపు: శోభాయాత్ర భోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌హాట్ మార్కెట్ వైపు కుడి మలుపు తీసుకున్నప్పుడు, గాంధీ విగ్రహం నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడే-కీ-ఖబర్ వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా కొత్త అఘాపురా వైపు మళ్లిస్తారు.

5. జాలీ హనుమాన్ ఆలయం: పురానాపూల్ జుమేరాత్ బజార్ నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ గాంధీ విగ్రహం వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా ఘోడే-కీ-ఖబర్/పురానాపూల్ వైపు మళ్లిస్తారు.

6. రహీంపురా: పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ పురానాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద పురానాపూల్ దర్వాజా, కర్వాన్, కుల్సుంపురా 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

7.గాంధీ విగ్రహం: MJ బ్రిడ్జ్ నుంచి టక్కర్‌వాడీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా, ఘోడే-కీ-ఖబర్ వైపు మళ్లించబడుతుంది. MJ బ్రిడ్జ్  నుంచి అఫ్జల్‌గంజ్/సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.

8.  టక్కర్‌వాడీ జంక్షన్: బేగంబజార్ ఛత్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ రాణి అవంతి బాయి విగ్రహం వద్ద MJ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు.

9. రాణి అవంతి బాయి విగ్రహం (జుమేరాత్ బజార్): బేగంబజార్ బై-లేన్ల నుంచి గాంధీ విగ్రహం/పురానాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్ లేబర్ అడ్డా వద్ద అలాస్కా T-జంక్షన్ వైపు మళ్లిస్తారు.

10. బేగంబజార్ ఛత్రీ: మాలకుంట నుంచి MJ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్ అలాస్కా T-జంక్షన్ వద్ద దారుసలాం/మాలకుంట వైపు మళ్లిస్తారు. రంగచారి లేన్, అఫ్జల్‌గంజ్ నుంచి బేగంబజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ (శ్రీకృష్ణ జ్యువెలరీ వద్ద) నుండి MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

11. బర్తన్ బజార్: అఫ్జల్‌గంజ్ బై-లేన్ల నుండి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ U-టర్న్ వద్ద అఫ్జల్‌గంజ్/సాలార్‌జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు.

12. SA బజార్: అజంతా గేట్, జాంబాగ్‌ల నుంచి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద పుత్లీబౌలి, రంగమహల్ వైపు మళ్లిస్తారు.

13. SA బజార్ మసీదు: నయాపూల్ నుండి SA బజార్ మసీదు వైపు వచ్చే ట్రాఫిక్ అఫ్జల్‌గంజ్ T-జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ – శివాజీ బ్రిడ్జ్ – CBS వైపు మళ్లిస్తారు.

14. MJ మార్కెట్: నాంపల్లి, అబిడ్స్ నుండి SA బజార్ మసీదు వైపు వెళ్లే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిబౌలి  రంగమహల్ వైపు మళ్లిస్తారు.

15.అబిడ్స్ GPO: అబిడ్స్ రోడ్డు నుండి MJ మార్కెట్ వైపు వచ్చే ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు వైపు మళ్లిస్తారు. (యాత్ర శంకర్ షేర్ హోటల్ చేరుకోగానే ఈ మళ్లింపు తొలగిస్తారు).

16.SA బజార్/గౌలిగూడ చమన్: పుట్లిబౌలి నుండి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమన్ వద్ద త్రివేణి లాడ్జ్ CBS వైపు మళ్లిస్తారు.

17. శంకర్ షేర్ హోటల్: రంగమహల్ నుండి గౌలిగూడ చమన్ వైపు వచ్చే ట్రాఫిక్ పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్, MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. ఆంధ్ర బ్యాంక్ నుండి వచ్చే ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మళ్లిస్తారు.

18. రామ్ మందిర్ కమాన్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుండి పుట్లిబౌలి/జాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ రంగమహల్ Y-జంక్షన్ వద్ద CBS , అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు.

19. రామ్ మందిర్ కమాన్ (అబిడ్స్ నుండి): GPO-అబిడ్స్ నుండి పుట్లిబౌలి ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద DMHS ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. అబిడ్స్ రోడ్డు నుండి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

20.  పుత్లీబౌలి ఎక్స్ రోడ్: MJ మార్కెట్ నుండి ట్రూప్ బజార్/బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద GPO , MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

21. పుత్లీబౌలి ఎక్స్ రోడ్ (చాదర్‌ఘాట్ నుండి): చాదర్‌ఘాట్ నుండి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ DMHS ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ నుండి వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు.

22. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుండి DMHS ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద నింబోలిఅడ్డ – కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.

23. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ (నారాయణగూడ నుంచి): నారాయణగూడ నుండి బడీచౌడి వైపు వచ్చే ట్రాఫిక్ కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. అబిడ్స్ నుండి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

24. సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్: బాటా రోడ్–కింగ్ కోఠి –రాంకోఠి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు.
 
రద్దీగా ఉండే ప్రాంతాలు: బేగంబజార్ ఛత్రీ, SA బజార్, అఫ్జల్‌గంజ్ T-జంక్షన్, శివాజీ బ్రిడ్జ్, CBS, రంగమహల్ Y-జంక్షన్, పుట్లిబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్ర బ్యాంక్, అబిడ్స్ GPO, MJ మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలి అడ్డ. 

అత్యవసర సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement