30 %ఎంబీఏ సీట్లు ఖాళీగా వదిలేస్తున్న వైనం
ఫ్యాకల్టీ, మౌలిక వసతులకు భారీగా ప్రజాధనం
అనామక కాలేజీల్లో చేరుతున్న లక్షల మంది
దేశంలోని టాప్ ఐఐటీలు ఎంబీఏ సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంలేదు. మంజూరైన సీట్లలో 30 శాతానికిపైగా ఖాళీగా వదిలేస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు రెట్టింపు ఫీజులతో అనామక కాలేజీల్లో చేరుతుంటే.. ప్రజాధనంతో నడిచే టాప్ ఇన్‌స్టిట్యూట్స్ మంజూరైన సీట్లలో సైతం ప్రవేశాలు కల్పించకపోవడం సమంజసమా..?
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో టాప్ 20లో ఉండే ఈ ఐఐటీలు.. ప్లేస్‌మెంట్స్‌లో వెనుకబడుతున్నాయా... విద్యార్థులను చేర్చుకోవడంలో విఫలమవుతున్నాయా.. కారణాలు ఏమైనా కాని.. దేశంలోని ఉత్తమ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీల్లో భారీ సంఖ్యలో ఎంబీఏ సీట్లు మిగిలిపోవడం ప్రజాధనం వృథాకాక మరేమిటి?! ఐఐటీల్లో ఎంబీఏ సీట్లు ఖాళీగా మిగిలిపోవడంపై కెరీర్స్ 360 మ్యాగజీన్ ఫౌండర్ మహేశ్వర్ పెరి విశ్లేషణాత్మక కథనం..
తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఐఐటీల్లో మంజూరైన సీట్ల సంఖ్యకు, ఉద్యోగాలు పొందిన విద్యార్థుల సంఖ్యకు మధ్య చాలా అంతరం కనిపించింది. దాదాపు 40 శాతం మందికి ప్లేస్‌మెంట్స్ లభించలేదు. ఇవి దేశంలోని టాప్ 20 బీస్కూల్స్ జాబితాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్. ఇలా దేశంలోనే బెస్ట్ బీసూ్కల్స్‌లో కేవలం 60 శాతం మంది విద్యార్థులకే ఆఫర్లు లభించడం ఏమిటి? అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈ ఐఐటీలు మంజూరైన ఎంబీఏ సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంలేదని తేలింది.
అంటే 100 మంది విద్యార్థుల కోసం ఫ్యాకల్టీని, మౌలిక వసతులను, వనరులను తీసుకొని.. కేవలం 70, లేదా 80 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దేశంలోని బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌గా గుర్తింపు పొందిన ఐఐటీలు దేశ వనరులను ఇలా వృథా చేయడం బాధాకరం. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లు పూర్తి స్థాయిలో విద్యార్థులను చేర్చుకోవడం లేదు. ఇదంతా ప్లేస్‌మెంట్స్ శాతాలు, సగటు వేతనాలు ఎక్కువగా చూపి.. టాప్‌ర్యాంకుల్లో నిలిచేందుకేనా అనే సందేహం ఎదురవుతోంది.
5లక్షల మంది పోటీ
గతేడాది క్యాట్ పరీక్ష కోసం 3.2 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. 2.93 లక్షల మంది ఈ పరీక్ష రాసారు. మొత్తంగా 5 లక్షల నుంచి 5.2 లక్షల మంది విద్యార్థులు దేశంలో ఏదో ఒకచోట ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరారు. ఒకవైపు దేశంలో ఎంబీఏ కోర్సులో చేరడానికి ఏటా లక్షల సంఖ్యలో పోటీపడుతుంటే... జాతీయస్థాయిలో ఉత్తమ పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ సీట్లు పూర్తి స్థాయిలో భర్తీచేయకపోవడం సమంజసంకాదు.
టాప్ ఐఐటీలు కేవలం 60 శాతం సీట్లను భర్తీ చేస్తున్నాయి. మిగతా 40 శాతం సీట్లు భర్తీ చేయకుండా వదిలేస్తున్నాయి. ప్రవేశాల కోసం ప్రభుత్వం అనుమతి పొంది ప్రజాధనంతో ఫ్యాకల్టీ, తరగతి గదులు, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్న ఈ ఇన్‌స్టిట్యూట్స్.. పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేయడంలేదు.
ఐఐటీ ఢిల్లీ
» 2025 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన ఈ ఐఐటీ ఢిల్లీ..
» 2022–23 విద్యాసంవత్సరంలో దాదాపు 35 శాతం సీట్లను భర్తీ చేయలేదు.
» అదే బీటెక్‌లో ఈ స్థాయిలో సీట్లు భర్తీ చేయకుండా వదిలేయడం ఊహించగలమా? అది అసాధ్యం. ఇక్కడ 2022–23లో 144 సీట్లు మంజూరైతే కేవలం.. 93 సీట్లు భర్తీ చేశారు. ఇందులో 89 మందికి ప్లేస్‌మెంట్స్ లభించినట్లు చెప్పారు. అంటే 95 శాతం మందికి ప్లేస్‌మెంట్స్ దక్కాయన్నమాట!! కాని మంజూరైన మొత్తం సీట్ల కోణంలో చూస్తే 61.81 శాతం మందికి మాత్రమే ప్లేస్‌మెంట్స్ లభించినట్లు లెక్క!
» దీనిపై మంజూరైన అన్ని సీట్లను భర్తీ చేయడంలేదు అని చెబుతున్నారు.
» ఇది మాకు విస్మయం కలిగించింది. ప్లేస్‌మెంట్స్ లభించకుంటే అర్థంచేసుకోవచ్చు. కాని మంజూరైన సీట్లలో ప్రవేశం కల్పించకపోవడం ఏమిటి? అది కూడా దేశంలోని టాప్ 4వ స్థానంలో ఉన్న బీసూ్కల్ పూర్తి సీట్లు భర్తీ చేయకపోవడం ఆందోళనకరం.
ఐఐటీ ఖరగ్‌పూర్ 
» 2025 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో నిలిచిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2022–23 విద్యాసంవత్సరంలో దాదాపు 40 శాతం సీట్లు భర్తీచేయలేదు. ఇక్కడ
» 206 సీట్లు మంజూరైతే.. కేవలం 125 మందిని చేర్చుకున్నారు. 124 మందికి ప్లేస్‌మెంట్స్ లభించినట్లు పేర్కొన్నారు. అంటే.. 99 శాతం మందికిఉద్యోగాలు లభించాయి. మంజూరైన సీట్ల కోణంలో చూస్తే మాత్రం60 శాతం మందికి మాత్రమే ప్లేస్‌మెంట్స్ లభించినట్లు భావించాలి.
ఐఐటీ మద్రాస్ 
» 2025 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచిన ఐఐటీ మద్రాస్‌లో పరిస్థితి ఇది.
ఐఐటీ బాంబే 
» 2025 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో నిలిచిన ఐఐటీ
బాంబేలో 2022–23 విద్యాసంవత్సరంలో 37 శాతం సీట్లు భర్తీకాలేదు. మంజూరైన 182 సీట్లలో 114 మాత్రమే భర్తీ చేశారు. కాని భర్తీ అయిన 114 మందిలో111 మందికి ప్లేస్‌మెంట్స్ లభించాయి. అంటే 97.37శాతం మందికి ఉద్యోగాలుదక్కినట్లు ప్రకటించారు. కాని మంజూరైన సీట్ల కోణంలో చూస్తే.. కేవలం 60 శాతం మందికే ఆఫర్లు దక్కాయి.


