
జ్యోతిప్రజ్వలన చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో జస్టిస్ శామ్‌కోషి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం ప్రజాస్వా మ్యానికి బలమైన ఆధారమని, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం అయ్యే శక్తిని ఇస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం తీసుకువస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం కొద్దిమంది చేతుల్లో కాకుండా ప్రజల చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు.
సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్‌కోషి మాట్లాడుతూ.. ఆర్‌టీఐ చట్టం పౌరులను శక్తివంతం చేస్తుందన్నారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఈ పద్ధతి సరికాదని సూచించారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌టీఐ పనితీరు పురస్కారాలను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్తు, సమాచార హక్కుచట్టం కమిషనర్‌లు పాల్గొన్నారు.