ఉపాధి పనికి ఆలయ అర్చకుడు  | Temple Priest Working For Mahatma Gandhi Employment Scheme | Sakshi
Sakshi News home page

ఉపాధి పనికి ఆలయ అర్చకుడు 

Mar 26 2021 3:47 AM | Updated on Mar 26 2021 8:42 AM

Temple Priest Working For Mahatma Gandhi Employment Scheme - Sakshi

శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు.

కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 30% కల్పిస్తూ వేతనాలు పెంచిన తెలంగాణ సర్కారు అర్చకులను విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధి పనులకు వెళ్లినట్లు తెలిపాడు.

ప్రస్తుతం  ఇస్తున్న రూ.6 వేల గౌరవవేతనంలో రూ. 2 వేల వరకు సామగ్రికి వెచ్చిస్తున్నామని, అదికూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement