రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి  | Telangana Rythu Sangam Demand Compensation To Farmers Over Floods | Sakshi
Sakshi News home page

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి 

Jul 21 2022 1:40 AM | Updated on Jul 21 2022 9:22 AM

Telangana Rythu Sangam Demand Compensation To Farmers Over Floods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ..తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, బ్యాంకులు రుణ సహాయం చేయాలని కోరారు. సమావేశంలో అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement