TS Police: ఈవెంట్స్‌ కంప్లీట్‌.. ఫైనల్‌ పరీక్షలకు బస్తీమే సవాల్‌

Telangana Police Recruitment Exam Events Complete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్‌ ఫిటెనెన్‌ టెస్టుల్లో పాల్గొన్నారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈవెంట్స్‌ జరిగాయి. 

ఈ పరీక్షలకు 2.07 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్‌ మూడో వారం వరకు మెయిన్స్‌ నిర్వహిస్తారు. కాగా, 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాయనున్నారు. 15644 కానిస్టేబుల్‌ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబ్కారీ కానిస్టేబుల్‌ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాయనున్నారు.

కాగా, ఈవెంట్స్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్‌కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్‌ ఇచ్చినట్టు బోర్డ్‌ తెలిపింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో 53.7 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఇక, 2018-19 నోటిఫికేషన్‌లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో​ క్వాలిఫై అయనట్టు బోర్టు అధికారులు ‍వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top