
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బర్డ్ ఫ్లూ(Bird Flu) కేసులు నమోదు కాలేదని తెలిపారు తెలంగాణ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి. ఇతర కారణాలతో కోళ్లు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు.
తెలంగాణ పశు సంవర్థకశాఖ డైరెక్టర్ గోపి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్‌కు పంపించాం. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు తేలింది. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ.
ఈ నేపథ్యంలో చికెన్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు. చికెన్, కోళ్లను ఉడికించి తినటం వలన వైరస్ బతికే ఛాన్స్ లేదు. కోళ్ల ఫారాలలో వైరస్ సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment