నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం | Telangana Mla Quota MLC Candidates Nominations Updates | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు నేడే చివరి రోజు.. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

Mar 10 2025 8:26 AM | Updated on Mar 10 2025 1:05 PM

Telangana Mla Quota MLC Candidates Nominations Updates

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరే అభ్యర్థి పోటీలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు అభ్యర్థులు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌, సీపీఐ అభ్యర్థి సత్యం బరిలో ఉన్నారు. ఇక, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ పోటీలో నిలిచారు. ఇక, నామినేషన్ పేపర్లపై అభ్యర్థులను బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌ సేకరించారు. నేడు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పెద్దలు హాజరుకానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement