తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు

Telangana Minister Gangula Kamalakar Comments On Rice Millers - Sakshi

మంత్రి గంగుల కమలాకర్‌ 

రైతుల ఫిర్యాదుతో మిల్లు సీజ్‌కు ఆదేశం

వైరా: ధాన్యం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగం గా శనివారం ఆయన వైరా మార్కె ట్‌ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాము లునాయక్‌లతో కలసి తనిఖీ చేశా రు.

ఈ సందర్భంగా ‘కుప్పలు.. తిప్పలు, ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న మిల్లర్లు ’శీర్షికతో గురువా రం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమై న కథనాన్ని పలువురు మంత్రి దృష్టికి తీ సుకొచ్చారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్‌ తేమ శాతం ఎంత ఉంటే కొను గో లు చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించారు.

పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల ద్వారా మిల్లర్ల అక్రమాలను అడ్డుకోవాల ని సూచించారు. పలువురు రైతులు కొణి జర్ల మండలంలోని ఎస్‌ఆర్‌ మిల్లు యజ మాని బస్తాకు పది కేజీలు తరుగు పేరుతో తీస్తున్నారని ఫిర్యాదు చేయగా.. వెంటనే ఆ మిల్లును సీజ్‌ చేయాలని కలెక్టర్‌ గౌత మ్‌ను మంత్రి ఆదేశించారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top