ఆకస్మిక గుండెపోటు సంఘటనలు: తెలంగాణలో సీపీఆర్‌పై శిక్షణ

Telangana Medical And Health Department Decision CPR Training In District - Sakshi

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. అన్ని జిల్లాల్లో నూ కార్డియో–పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌), ఆటోమేటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ)లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రతీ జిల్లాకు 4 నుంచి ఏడుగురు మాస్టర్‌ ట్రైనర్లను పంపించనుంది.

ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, మున్సిపల్‌ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, కమ్యూనిటీ వలంటీర్లు, షాపింగ్‌ మాల్స్‌ ఉద్యోగులు, పెద్ద కాంప్లెక్స్‌ల్లో ఉండేవారికి సీపీఆర్, ఏఈడీలపై శిక్షణ ఇస్తారు. 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 160 మంది మాస్టర్‌ ట్రైనర్లు హైదరా బాద్‌లో సీపీఆర్‌లో శిక్షణ పొందారు.

ప్రతి మాస్టర్‌ ట్రైనర్‌ వారానికి 300 మందికి శిక్షణ ఇస్తారు. మనిషిని పోలిన బొమ్మలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ కా ర్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.ౖ కలెక్టరేట్లలోనూ శిక్షణనిస్తారు. ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్‌ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top