TG: ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ | Telangana: Massive Recruitment In Health Department Once Again | Sakshi
Sakshi News home page

TG: ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ

Jun 26 2025 4:39 PM | Updated on Jun 26 2025 6:12 PM

Telangana: Massive Recruitment In Health Department Once Again

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఒకే రోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 3,212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్‌, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ జాబితాలు సిద్ధమవుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ బోర్డు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement