
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని బుధవారం ప్రకటించింది. ఎండలు దంచికొడుతున్న కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయా రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం..కు పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు ఏడు గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కాగా, తెలంగాణకు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి. ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఈ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణలో లోక్‌సభ బరిలో మొత్తం 525 మంది ఉన్నారు. ై సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నారు.