శ్రీలంక తరహాలో రాష్ట్రంలో కుటుంబ దోపిడీ  | Telangana: Komatireddy Venkat Reddy Appointed Star Campaigner | Sakshi
Sakshi News home page

శ్రీలంక తరహాలో రాష్ట్రంలో కుటుంబ దోపిడీ 

Apr 12 2022 2:26 AM | Updated on Apr 12 2022 3:06 PM

Telangana: Komatireddy Venkat Reddy Appointed Star Campaigner - Sakshi

అనుచరులతో ఎంపీ కోమటిరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: శ్రీలంక తరహాలోనే తెలంగాణలోనూ ఒకే కుటుంబం దోపిడీ సాగుతోందని భువనగిరి ఎంపీ, టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సంపద నలుగురు జేబుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమితులైన తర్వాత సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను స్వీకరిస్తాన ని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కొత్తగా తిట్టాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, భూముల దోపిడీ పెరిగిపోయిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కుం టుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వేలసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సర్కారు బడులు మూసేస్తున్నారు. వైద్యం పడకేసింది.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసే లేదు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా కేసీఆర్‌ ఫాంహౌస్‌కు మాత్రం నీళ్లు తీసుకెళ్లారు’అని విమర్శించారు. కేసీఆర్‌ ఢిల్లీలో చేసిన దీక్ష ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌పార్టీ బలపడుతున్న నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కేసీఆర్, మోదీలు కలసి ఆడుతున్న రాజకీయక్రీడ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement